calender_icon.png 19 April, 2025 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేట్లకు లాభాలు...పేదాలపై భారాలు...

12-04-2025 06:31:46 PM

కేంద్రం పాలనపై సీపీఎం మండిపాటు.. 

ఆదిలాబాద్ (విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలన చూస్తే కార్పొరేట్లకు లాభాలు.. పేదాలపై భారాలు.. మోపే విధంగా ఉందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ ఆశన్న మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్ ధరను రూ. 50 పెంచడాన్ని నిరసిస్తూ, పెంచిన ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం రణదివే నగర్ లో గ్యాస్ సిలెండర్ కట్టెల పోయితో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు మంజుల, లంక జమున ఆశన్న, అర్ఫా బేగం, నగేష్, విజయ, తదితరులు పాల్గొన్నారు.