calender_icon.png 28 October, 2024 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో సిపిఎం సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర ప్రారంభం

29-07-2024 04:36:31 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కాంట్రాక్ట్ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం సిపిఎం సింగరేణి పరిరక్షణ బస్సు యాత్రను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించం అని చెప్తున్నప్పటికీ దానికోసం ఎక్కడ పోరాడడం లేదని విమర్శించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాల వల్ల సింగరేణి సంస్థ మనుగడకే ప్రమాదం వాటిల్ల పోతుందని అన్నారు. సింగరేణి పరిరక్షించడంలో భాగంగానే సింగరేణి పరిరక్షణ పేరుతో బస్సు యాత్రను చేపట్టడం జరుగుతుందని అన్నారు.

గత బిఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి పరిరక్షణ విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధిని పాటించడం లేదని విమర్శించారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని మండిపడ్డారు.

వేలంలో ప్రైవేటు సంస్థలకు బొగ్గు బ్లాకులను అప్పజెప్పిన తర్వాత సింగరేణి ప్రస్తుతం ఉన్న గనులతో మనుగడ సాగించలేదని అన్నారు. సింగరేణి తనకు తానుగా ఆత్మహత్య చేసుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ దమన నీతిని చాటుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చేరుపల్లి సీతారాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, జి ప్రకాష్, ఫైళ్ల ఆశయ్య, మంచిర్యాల జిల్లా కమిటీ కార్యదర్శి సంకె రవి, సభ్యులు దూలం శ్రీనివాస్, నరసింహారావు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు