calender_icon.png 4 February, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల పెన్నిది కాసాని ఐలయ్య..

04-02-2025 06:52:36 PM

సంతాప సభలో సీపీఎం పార్టీ రాష్ట్ర నేత ఏ జే రమేష్..

ఇల్లెందు (విజయక్రాంతి): సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య సంతాప సభ ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఏలూరి భవన్ లో మునిగంటి లక్ష్మీ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సభలో సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులుఏ జే రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ... కాసాని ఐలయ్య  కొత్తగూడెంలో అనేక ప్రాంతాలలో గుడిసెల పోరాటాలు ఉదృతంగా చేసి అనేక చోట్లలో వేలాది మంది పేద ప్రజలతో గుడిసెలు వేయించి ఆనేక మందికి ఇళ్ళ స్థలాలు ఇప్పించిన మహనీయుడు కాసాని ఐలయ్య అని అన్నారు. సుజాతనగర్ గ్రామ పంచాయతీకి ఆయనతో పాటు, ఆయన సతీమణి లక్ష్మీ సర్పంచ్ గా చేశారని ఆయన తెలిపారు.

ఆనేక వ్యవసాయ కూలీ పోరాటాలు ఉదృతంగా చేసిన మహనీయుడు కాసాని ఐలయ్య అని అన్నారు. అలాంటి మహా నేత కాసాని సంతాప సభలు ఈ నెల మొదటి వారం రోజులు జరపాలని సీపీఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ రోజు ఇల్లందులో సంతాప సభ నిర్వహించారు. ఈ సభలో పార్టీ జిల్లా నాయకులు అబ్దుల్ నబీ, పార్టీ మండల కార్యదర్శి ఆలేటి కిరణ్ కుమార్, తాళ్లూరి కృష్ణ, మన్యం మోహన్ రావు, ఆలేటి సంధ్య,మాదరపు వెంకటేశ్వర్లు, కే మరియా, కోడెం బోస్,ఎం డి అబ్బాస్, తాళ్లూరి పద్మ, కడారి వెంకటమ్మ, తాండ్ర కాంత, సంతోష, కమల, హసీనా తదితరులు పాల్గొన్నారు.