calender_icon.png 16 January, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారాం ఏచూరి కన్నుమూత

12-09-2024 04:29:34 PM

న్యూఢిల్లీ: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం (72) గురువారం కన్నుముశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఏచూరి తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల సమస్యలతో సీతారాం బాధపడుతూ గత నెల 19న ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. ఏచూరి స్వస్థలం కాకినాడ, పూర్తిపేరు ఏచూరి సీతారామారావు. సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. ఏచూరి 1975లో సీపీఎం ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఏచూరి ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ మోహన్‌ కందాకు మేనల్లుడు. 1974లో సీతారాం స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చేరారు.

ఏడాది తర్వాత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సస్ట్)లో చేరారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో జేఎన్యూలో విద్యార్థిగా ఉన్నప్పుడు అరెస్టు అయ్యారు. 1977-78లో మూడుసార్లు జేఎన్యూ అధ్యక్షుడిగా, 1978లో ఎస్ఎఫ్ఐ అఖిల భారత జాయింట్ సెక్రటరీగా, 1984లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీకి ఏచూరి సీతారాం ఎన్నికయ్యారు. 2005 జలైలో బంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇంద్రాణి మజుందార్‌తో సీతారాం ఏచూరికి వివాహం జరిగింది. ఏచూరికి కూతురు అఖిలా ఏచూరి, కొడుకు ఆశిష్ ఏచూరి ఉన్నారు. జర్నలిస్ట్ సీమా చిస్తీని ఏచూరి రెండవ వివాహం చేసుకున్నారు. 2021 ఏప్రిల్ 22న కొవిడ్‌తో కొడుకు ఆశిష్ చనిపోయాడు. ఏచూరి మృతిపట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు.