calender_icon.png 24 February, 2025 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరేందర్ రెడ్డికి మద్దతు పలికిన సిపిఎం నాయకులు

24-02-2025 05:30:19 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్, కోట శ్రీనివాస్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... బిజెపి పార్టీ ఉమ్మడి నాలుగు జిల్లాలలో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు గెలిచినప్పటికీ కనీసం నయా పైసా పని కూడా చేయలేదని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్రం మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి రవీందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు కార్తీక్, టికానంద్, మాల శ్రీ తదితరులు పాల్గొన్నారు.