కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో సీపీఎం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ ను గురువారం జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలోని సమస్యలను బృందాకారత్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారించాలని కోరారు. విద్య, వైద్య పరంగా జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని తెలపడంతో స్పందించిన ఆమె ఈ విషయంపై జాతీయస్థాయిలో పోరాడుదాం అని తెలిపారు. కలిసిన వారిలో పార్టీ రాష్ట్ర నాయకులు రవికుమార్, జిల్లా కార్యదర్శి రాజన్న, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్, జిల్లా కమిటీ సభ్యుడు ఆనంద్ తదితరులున్నారు.