calender_icon.png 18 March, 2025 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మార్పీఎస్ నిరసన దీక్షకు మద్దతు తెలిపిన సిపిఎం నాయకులు, గిరిజన జర్నలిస్టులు

17-03-2025 08:10:58 PM

మఠంపల్లి: ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత అయ్యే వరకు ఉద్యోగ ఫలితాలను, నియామాకాలు నిలిపివేయాలని కోరుతూ మఠంపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు ఎనిమిదవ రోజు కొనసాగాయి. ఈ నిరసన దీక్షలకు సిపిఎం మండల కార్యదర్శి మాలోతు బాలు నాయక్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు భూక్య పాండు నాయక్, గిరిజన జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోతు రవీందర్ నాయక్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఇరుగు ప్రభు, పిఎసిఎస్ మాజీ చైర్మన్ దైద రాయులు, ఎంఎస్పి మండల అధ్యక్షుడు కస్తాల వెంకటేశ్వర్లు, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు బచ్చలకూరి నాగబాబు, గుండెపంగు సురేష్,సైదులు, చెడపంగు జోజి, తదితరులు పాల్గొన్నారు.