22-03-2025 08:59:09 AM
సంగారెడ్డి,(విజయ క్రాంతి): హైదరాబాద్ లో ని ఇంద్ర పార్క్ వద్ద నిర్వహించే ధర్నాకు వెళ్లకుండా ముందస్తుగా సిపిఎం నాయకులను(CPM leaders) పోలీసులు అరెస్టు చేశారు. శనివారం తెల్లవారుజామున సిపిఎం నాయకులను పోలీసులు సంగారెడ్డిలో అరెస్టు చేసి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. సిపిఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్, సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు ను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసి పోలీసులు తరలించారు. హైదరాబాదులో నిర్వహించే ధర్నాకు అనుమతి ఉన్న అక్రమంగా తమను అరెస్టు చేశారని వారు తీవ్రంగా ఖండించారు.