calender_icon.png 24 April, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ధర్నా

24-04-2025 06:24:15 PM

ఇల్లెందు (విజయక్రాంతి): గత నెల రోజులుగా సీపిఎం పార్టీ ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో ఇల్లందు మండల విజయ లక్ష్మి నగర్, తిలక్ నగర్ గ్రామ పంచాయితీ వార్డుల్లో ప్రజా సమస్యలను అధ్యయనం చేసి సామాజిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం గురువారం స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయాల ముందు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. అనంతరం పంచాయతీ గుమస్తా వంశీకి వినతి పత్రాలను విడివిడిగా సమర్పించారు. పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు సుల్తానా అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ జిల్లా నాయకులు అబ్దుల్ నబి  మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారంటీ లను అమలు చేస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుకు చిత్తశుద్ధి చూపక పోవడం లేదన్నారు.

అడిగిన వారందరి ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డు, త్రాగునీరు, కరెంటు, ఇందిరమ్మ ఇళ్లు మౌళిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పూసపల్లి ఓసీ ఎక్సటెన్షన్ పేరుతో అక్కడ ఇండ్ల నిర్మాణాన్ని, చిన్న చిన్న మరమత్తులు కూడా చేయకుండా సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. విజయలక్ష్మి నగర్ పూసపల్లి ఓసీ నిర్వాసితులకు 2013 భూ నిర్వాసిత పునరావాస చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని వారు కోరారు.

తిలక్ నగర్, విజయ లక్ష్మి నగర్ పరిధి లోని అన్ని వార్డులకు మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని, డ్రైనేజీ పారిశుధ్య పనులు చేపట్టాలని, వీధి దీపాలు అమర్చాలని, కోతులు, కుక్కలు, పందులు, దోమల బెడద నివారించాలని, లాల్ మహ్మద్ నగర్ డేవలప్మెంట్ కాలనిలలో బొల్లి నగర్ బోరు నీరు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోపార్టీ మండల కమిటీ సభ్యులు, తాళ్లూరి కృష్ణ, మన్యం మోహన్ రావు, వజ్జ సురేష్, మొలుగు శ్రీనివాస్, లకావత్ రోజా, నరేష్, గాజుల లీలా, అయ్యోరీ రామానుజ, జీడి బాలమ్మ, జాడి సారమ్మ, తార, షాహేద,  భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.