calender_icon.png 27 October, 2024 | 10:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలపై సీపీఎం పోరాటం

27-10-2024 12:32:33 AM

పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 

సంగారెడ్డి, అక్టోబర్ 26 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ప్రజా సమస్యలపై సీపీఎం పోరాటం చేస్తుందని తెలిపారు. శనివారం సంగారెడ్డిలో నిర్వహించిన మహాసభల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.

2025 జనవరి 25,26,27 తేదీల్లో సీపీఎం రాష్ట్ర 4వ మహాసభలను సంగారెడ్డి నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, అంబానీ, అదానీలకు అనుకూలంగా పని చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీరయ్య, చుక్కు రాములు, సంగారెడ్డి కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, కే రాజయ్య, బీ రాంచందర్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.