23-03-2025 07:01:53 PM
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం...
మునుగోడు (విజయక్రాంతి): గ్రామాలలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం గ్రామ గ్రామాన పోరుబాటతో పోరాటాలకు సిద్ధమవుతున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో పలు వార్డులను సర్వే నిర్వహించి మాట్లాడారు. గత కొంతకాలంగా గ్రామాలలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో గ్రామాలలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామాలలో తాగునీటి కొరత లేకుండా, ప్రజలకు కావలసిన మౌలిక వసతులను కల్పించాలని కోరారు. కిష్టాపురం శివారులో నిర్మిస్తున్న ఫార్మా కంపెని అనుమతులు రద్దు చేసి తక్షణమే పనులు నిలిపివేసి పరిశ్రమను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు వరికుప్పల ముత్యాలు, యాసరాణి శ్రీను, మిరియాల భరత్, వేముల లింగస్వామి, యాట యాదయ్య, కట్ట లింగస్వామి, పగిళ్ల మధు, చికూరి బిక్షం, పగిళ్ళ పరమేష్, కల్వలపల్లి గ్రామ కార్యదర్శి వంటేపాక అయోధ్య, వంటేపాక రమేష్, యాసరాని వంశీకృష్ణ, యట శ్రీకాంత్ ఉన్నారు.