calender_icon.png 19 April, 2025 | 8:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామపంచాయతీలో మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం ధర్నా

16-04-2025 06:06:58 PM

ఇల్లెందు (విజయక్రాంతి): సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఇల్లందు మండలం పార్టీ శాఖల ఆధ్వర్యంలో సిఎస్పీ బస్తీ, సుభాష్ నగర్, ఇందిరా నగర్ గ్రామపంచాయతీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఎస్పీ బస్తీ  గ్రామపంచాయతీ కార్యాలయం ముందు బుధవారం గ్రామపంచాయతీ వాసులతో ధర్నా నిర్వహించారు.

ఈ యొక్క ధర్నా కార్యక్రమాని ఉద్దేశించి సిపిఎం జిల్లా నాయకులు అబ్దుల్ నబి, మండల కార్యదర్శి ఆలేటి కిరణ్ లు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలో ఉన్నటువంటి నివాసులు మౌలిక వసతులకి నోచుకోక ఉందని ప్రభుత్వం ప్రకటించిన పథకాలు రేషన్ కార్డులు పెన్షన్లు కొత్త పెన్షన్లు రావట్లేదని ఇందిరమ్మ ఇల్లు గ్రామసభలో వచ్చినటువంటి పేర్లు కొంతమందికి వచ్చినయని కొంతమంది అధికార పార్టీ వారికే యొక్క ఇందిరమ్మ ఇల్లు వచ్చినయని ప్రభుత్వం వెంటనే స్పందించి పంచాయతీలో ఉన్నవంటి సమస్యలు పరిష్కారం కాకపోతే రానున్న కాలంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలకు సిద్ధమవుతావని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

దేవులపల్లి యాకయ్య నగర్ లో పలు దఫాలుగా సమస్యలు విన్నవించుకున్న పట్టించుకోక నిర్లక్ష్యంగా ఉన్నారని అన్నారు. త్రాగు నీరు సరఫరా చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తాళ్లూరి కృష్ణ, మన్నెం మోహన్ రావు, మాదారపు వెంకటేశ్వర్లు, వజ్జ సురేష్, దర్గయ్య, సంతోష, వెంకన్న, సుజాత, హుస్సేన్, వీరభద్రం, నీలారాణి, భవాని, జ్యోతి, పాషా తదితరులు పాల్గొన్నారు.