calender_icon.png 8 January, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడిసె వాసులపై అటవీ అధికారుల నిర్భందాన్ని ఖండించాలని సీపీఎం ధర్నా

07-01-2025 05:34:38 PM

ఇల్లెందు (విజయక్రాంతి): సిపిఎం పార్టీ ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలుగా సిఎస్పి బస్తీ శివారులోని ప్రభుత్వ భూమిలో నిరుపేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్న దేవులపల్లి యాకయ్య నగర్, సున్నం రాజయ్య నగర్ లకు చెందిన వారిపై ఫారెస్ట్ అధికారులు నిర్భందం విధిస్తూ ఇక్కడి ప్రజలకు త్రాగునీరు ఇవ్వవద్దని మిషన్ భగీరథ అధికారులకు ఆదేశాలు జారీచేసి గుడిసె వాసులకు త్రాగునీరు ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు ఉపక్రమించడంతో పేద ప్రజలు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండు నుంచి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసు వరకు ప్రదర్శన నిర్వహించి అటవీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

అనంతరం ఫారెస్ట్ రేంజర్ కి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఎఫ్ఆర్వో మాట్లాడుతూ.. తన శాఖ రెవిన్యూ అధికారులతో జాయింట్ సర్వే చేస్తామని చెప్పారు. పార్టీ జిల్లా నాయకులు, ఇల్లందు మండల కార్యదర్శి అబ్దుల్ నబి, ఆలేటి కిరణ్ కుమార్ లు మాట్లాడుతూ.. ఫారెస్ట్ అధికారులు నిర్భందం ఆపాలని, త్రాగునీరు, మౌళిక వసతులు కల్పించే విధంగా ఇతర శాఖల అధికారులకు సహకరించాలని కోరారు. అధికారులు స్పందించకుంటే నిరవధీక దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు తాళ్లూరి కృష్ణ, మన్యం మోహన్ రావు, షేక్ ఖాదర్, పులిపాటి వీరభద్రం, పల్లి సుజాత, గడ్డం వెంకన్న, కమల, హసీనా, హుస్సేన్, విజయ, రాజేష్, రాజు, కౌసల్య, అమ్మి, పద్మ, సుగుణ, జ్యోతి, ఎస్తేరు, రాణి తదితరులు పాల్గొన్నారు.