calender_icon.png 24 October, 2024 | 9:54 AM

బేషరతుగా రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలి

29-08-2024 03:31:25 PM

 వెంటనే రైతు భరోసాచెల్లించాలి....

 కలెక్టరేట్ ఎదుట వామపక్షాల ధర్నా...

ఆదిలాబాద్, (విజయక్రాంతి): రైతులకు బేషరతుగా రెoడులక్షల రూపాయల రుణమాఫీ చేయాలనీ సీపీఎం పార్టీ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షా పార్టీల ఆధ్వర్యంలో బాధిత రైతులతో కలిసి జిల్లా కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ తీరు నిరసిస్తూ పెద్దపెట్టున్న నినాదాలతో హోరెత్తించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈమేరకు మల్లేష్ మాట్లాడుతూ... రైతులందరికీ బేషరతుగా 2 లక్షల వరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా వేయక పోవడంతో రైతులకు తగిన సమయంలో పెట్టుబడి సహాయం అందాకా మధ్య దళారులను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు.

వెంటనే రైతు భరోసా వేయాలన్నారు. రెండు లక్షల రుణమాపీ చేస్తామంటే రైతులు, రాజకీయ పార్టీలు అన్ని స్వాగతించి, ప్రభుత్వ నిర్ణయాన్ని అబినందించాయి అన్నారు. కానీ జీవో 567 లో అనేక నిబంధనలు పెట్టడం ఫలితంగా జిల్లాలో ఇప్పటికి కేవలం 40 శాతం మందికి మాత్రమే రుణమాపీ జరిగిందన్నారు. 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు జమచేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. రైతులందరికీ మూడవ విడత రుణమాపీ పూర్తి అయినట్టు స్వయానా ముఖ్యమంత్రి ప్రకటించడంతో రుణమాపీ కాని రైతుల్లో ఆందోళన మొదలయ్యి, దింతో రైతులు రోడ్లమీదకు వచ్చారన్నారు. రైతుల్ని సముదాయించాల్సింది పోయి ఆదిలాబాద్ జిల్లా రుయ్యాడి గ్రామంలో రైతులపై కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ రైతులు రెండు లక్షల లోపు రుణం ఉన్నవారు, రేషన్ కార్డు ఉన్నవారు, పట్టాపాస్ బుక్ ఉన్నవారు అలాంటి వారికీ కూడా రైతు రుణమాఫీ కాలేదు. 100 శాతం రుణమాఫి ఎక్కడ జరునట్టని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లంక రాఘవులు, సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు జగన్ సింగ్, సీపీఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ నారాయణ, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ ఆశన్న, నాయకులు లింగాల చిన్నన్న, అగ్గిమల్ల స్వామి తోపాటు వివిధ గ్రామాల నుండీ వచ్చిన ఆదివాసీ రైతులు పాల్గొన్నారు.