calender_icon.png 25 February, 2025 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తపస్‌పల్లి నీటిని చేర్యాల ప్రాంతానికే ఇవ్వాలి

19-02-2025 12:00:00 AM

  1. బైక్ ర్యాలీలో సీపీఎం డిమాండ్ 

  2.  చేర్యాల, ఫిబ్రవరి 18: దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తపస్ పల్లి రిజర్వాయర్ నింపి, ముందుగా చేర్యాల ప్రాంత పంటలకు సాగునీరు అందించిన తర్వాతనే మిగతా ప్రాంతాల గురించి ఆలోచించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తిరెడ్డి అన్నారు. చేర్యాల ప్రాంత సాగునీటి కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కొమురవెల్లి నుంచి తపస్ పల్లి రిజర్వాయర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.

  3. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేర్యాల, కొమురవెల్లి, దుల్మీట,మద్దూరు మండలాలలో సాగు నీరు లేక పంటలు ఎండిపోతు న్నాయన్నారు. ఇక్కడి ప్రాంతం లో పంటలు ఎండిపోతుంటే ఇతర ప్రాంతాలకు నీటిని తరలించడం ఏమిటని ప్రశ్నించారు. తపస్ పల్లి రిజర్వాయర్ నిర్మించిందే ఈ ప్రాంత ప్రయోజనాల కోసం అన్నారు. ఈ ప్రాంతం సముద్రమట్టానికి 550 మీటార్ల ఎత్తులో ఉన్నందున నీటికి ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ప్రాజెక్టును నిర్మించడం జరిగిందన్నారు.

  4. కాంగ్రెస్ నాయకులు డ్యాం నిండకముందే నీళ్లు వస్తున్నాయని అబద్ధ ప్రచారాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు అన్నారు. ఎండలు ముదురుతుండడంతో సాగునీటి ఎద్దడి తలెత్తిందన్నారు. సకాలంలో సాగునీరు అందివ్వకపోతే నాలుగు మండలాల రైతాంగాన్ని ఏకం చేసి సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొంగర వెంకట్ మావో,  ఏలేటి యాదగిరి, బద్ది పడిగా కృష్ణారెడ్డి, అత్తిని శారద, బండ కింది అరుణ్, దాసరి ప్రశాంత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.