మందమర్రి (విజయక్రాంతి): పట్టణ మున్సిపల్ కమిషనర్ గా విధుల్లో చేరిన తుంగపిండి రాజలింగును సీపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, తెలంగాణ మున్సిపల్ కార్మికుల సంఘం (సిఐటియు) జిల్లా కార్యదర్శి కాసర్ల రాజలింగులు కలిసి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కమిషనర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు, సంగి పోషం, మెడపట్ల నర్సయ్య, పోసు, రవి, గట్టయ్య, అరుణ, స్వప్న, రాజేశ్వరి, మల్లమ్మ లు శాలువాతో సన్మానించడం జరిగింది.