calender_icon.png 28 March, 2025 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులను సిపిఎం ఖండన

25-03-2025 06:46:13 PM

సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు..

సంగారెడ్డి (విజయక్రాంతి): ఆశ వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేస్తే పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని సంగారెడ్డి జిల్లా సిపిఎం కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్ ఆరోపించారు. మంగళవారం సంగారెడ్డిలో ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం హైదరాబాద్ లో శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఆశ వర్కర్లపై రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరించి ఎక్కడికి అక్కడ అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేశారన్నారు. మహిళలైన ఆశ వర్కర్లను హింసించి, వారిని అరెస్టు చేయడం అత్యంత అన్యాయమని అన్నారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆశ వర్కర్లకు కనీస వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పుడు ఆ హామీని అమలు చేయకుండా, తమ హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, ఆశ వర్కర్లకు తక్షణమే కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిర్బంధాలతో పోరాటాలను అణచివేయలేరని, కార్మికులు, కర్షకులు, రైతు కూలీలు, ఉద్యోగస్తుల సమస్యలపై పోరాడేందుకు సీపీఎం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జయరాజు స్పష్టం చేశారు.