calender_icon.png 13 February, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగారంలో సిపిఐ గ్రామ శాఖ మహాసభ విజయవంతం

13-02-2025 06:23:44 PM

పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పరిధిలోని నాగారం గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) గ్రామ శాఖ మహాసభ పొదిలి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథులుగా పాల్గొని ముత్యాల విశ్వనాథం (సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు) మాట్లాడుతూ... భారత కమ్యూనిస్టు పార్టీ 1925లో ఆవిర్భవించిందని నేటికీ 99 సంవత్సరాలు పూర్తయి 100వ సంవత్సరంలో అడుగు పెట్టిందని, ఇంతవరకు 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన పార్టీ భారతదేశంలో లేదని మొదట్లో కాంగ్రెస్ పార్టీ ఆవు దూడ గుర్తుతో ఏర్పడినా అది మధ్యలోనే పోయిందని 1960 తరువాత ఇందిరాగాంధీ చేయి గుర్తు కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిందన్నారు. 

ఈ మధ్యకాలంలో ఎన్నో పార్టీలు ఆవిర్భవించి మధ్యలోనే అంతరించి పోయాయని భారత కమ్యూనిస్టు పార్టీ నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలు నిర్వహించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కాలం నుంచి ఇప్పటివరకు ప్రజల తరఫున నిలబడి లక్షలాది ఎకరాల భూములు పేదలకు పంచి, ఇంటి స్థలాలు ఇప్పించి, స్థానిక సమస్యల కోసం అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ ఎన్నో సాధించి పెట్టిందని, అందుకే కమ్యూనిస్టు పార్టీ ప్రజలలో ఎల్లకాలం మనగలుగుతుందని అన్నారు. నాగారం గ్రామంలో పేద ప్రజలందరూ కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా అభివృద్ధి కావాలని కోరారు. ఈ సభలో సిపిఐ పార్టీ పాల్వంచ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు మండల నాయకులు నిమ్మల రాంబాబు పాల్గొన్నారు. సభ అనంతరం 21 మందితో నూతన కమిటీని ఎన్నుకొన్నారు. కమిటీ కార్యదర్శిగా సాయిలు వెంకన్న సహాయ కార్యదర్శులుగా డేరంగుల రామయ్య, మహంకాళి లాజర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.