22-02-2025 04:47:32 PM
సకాలంలో టెండర్లు పిలిచి ప్రూనింగ్ పనులు చేపట్టాలి
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం(BKMU) జిల్లా అధ్యక్షులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు
పాల్వంచ,(విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు రెండో పంటగా ఉన్న తునికాకు 50 ఆకుల కట్టకు రూ.6 చెల్లించాలని, సకాలంలో టెండర్లు పిలిచి పనులు ప్రూనింగ్ పనులు చేపట్టాలని బికేయంయు జిల్లా అధ్యక్షుడు వీసంశెట్టి పూర్ణచంద్రరావు(BKUM District President Visamsetty Poornachandra Rao) డిమాండ్ చేశారు. మాల్లారం ఎస్టి గుంపు ఉలవనూరు లక్ష్మీదేవిపల్లి ఆడ్డా రోడ్డు సిపిఐ గ్రామ శాఖ మహాసభలు వజ్జా వాసు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ మాసభకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు, సిపిఐ పాల్వంచ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు పాల్గొని మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం 2025 సీజన్లో తునికాకు సేకరణ కాంట్రాక్టర్లును ఆహ్వానించి టెండర్లు పిలిచి వెంటనే ప్రూనింగ్ పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
వ్యవసాయ కార్మికులు గిరిజన పేద గిరిజనేతర్లు, వ్యవసాయ సీజన్ తర్వాత రెండవ పంటగా భావిస్తున్న తునికి ఆకు సేకరణ 50 ఆకుల కట్టకి రూ 6. చెల్లించాలని, గతంలో పెండింగ్లో ఉన్న బోనస్ పైసలు ఆకు సేకరణ కన్నా ముందే వారికి చెల్లించాలని, 14 జిల్లాల్లో లక్షలాది మంది జీవనోపాధి తునికాకు సేకరణ అని వారికి పని సమయంలో ప్రమాదం జరిగితే 25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు నిమ్మల రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వేములపల్లి శ్రీనివాసరావు, నిట్ట అమృతరావ్, వజ్జా వాసు, మహమ్మద్ పాషా, మహంకాళి తిరుపతిరావు, గుగులోత్ బద్య నాయక్, మహిళా సమాఖ్య నాయకురాలు కోరెం స్వర్ణలత, వాసం చుక్కమ్మ, సారమ్మా తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నిక చేసారు లక్ష్మీదేవి పల్లి శాఖ కార్యదర్శిగా వాసం కన్నయ్య, సహాయ కార్యదర్శిగా ఎండి పాషా, మల్లారం శాఖ కార్యదర్శిగా మాడే గణేష్, సహాయ కార్యదర్శిగా మాడే దూలయం, మరొక 21 మంది నూతన కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.