07-04-2025 12:00:00 AM
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఈటీ నరసింహ
ముషీరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాం తి): అన్ని న్యాయమైన పోరాటాలలో సీపీఐ శ్రేణులు ముందంజలో ఉండాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యులు ఈ.టి. నరసింహ పిలుపునిచ్చారు. నేడు దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు పెరుగుతున్న మతతత్వం, ద్వేషం అని, దింతో రాబోయే పోరాటాలు కష్టతరమైనవని,100 ఏళ్ళ కమ్యూనిస్ట్ ఉద్యమ స్ఫూర్తితో బలంగా ఎదుర్కోవాలని చెప్పారు.
హిమాయత్ నగ ర్ సత్యనారాయణ రెడ్డి భవన్‌లో ఆదివారం సీపీఐ హైదరాబాద్ జిల్లా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి. సలీం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఈ.టి. నరసిం హ ముఖ్య అథితిగా హాజరై ప్రసంగిస్తూ ప్రజల ఆందోళనలను విస్మరించి కేంద్రంలో ని మోదీ ప్రభుత్వం దేశ ప్రజలను మత ప్రాతిపదికన విభజించడానికి తీవ్రంగా కుట్రలు పన్నుతోందని, ఈ దుర్మార్గపు మతతత్వ శక్తుల కుట్రలను తీవ్రంగా ప్రతిఘటిం చాలని కోరారు.
ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండా అమ లు భాగంలో ప్రధాని మోదీ తీసుకునే ప్రతి నిర్ణయంలో రాజ్యాంగ నిర్వీర్యానికి, ప్రజాస్వామ్య పతనానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని, ఈ తిరోగమన నిర్ణయాలతో ప్రజల ప్రాథమిక హక్కులు కాలరాయబడుతాయని తెలిపారు. శేత్రస్థాయిలో లౌకి క, ప్రగతిశీల శక్తులతో కలసి రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని కాపాడటానికి ప్రజలను ఏకం చేసి పెద్దఎత్తున ఉద్యమాలు నిర్మించాలని అయన కోరారు.
సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్. ఛాయాదేవి మాట్లాడుతూ హైదరాబా ద్ నగరంలో ప్రతి బస్తి, కాలనీలలో త్వరలో పాదయాత్రలు నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి ఉద్య మిస్తామని తెలిపారు.
ఈ నెల 14 న డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ 134 వ జయంతిని వాడవాడలా ఘనంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో సిపిఐ హైదరా బాద్ జిల్లా సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బి. స్టాలిన్, కార్యవర్గ సభ్యులు ఎం. నరసింహ, జి. చంద్రమోహన్ గౌడ్, నిర్లేకంటి శ్రీకాంత్, చందు నాయక్, పడాల నళిని, కంపల్లి శ్రీనివాస్, షంషుద్దీన్, ఎండి సలీమ్, ఎండి. ఒమర్ ఖాన్ పాల్గొన్నారు.