25-04-2025 07:32:10 PM
మృతదేహంపై సీపీఐ జెండాను కప్పి శ్రద్ధాంజలి ఘటింటించిన నాయకులు..
అంతిమ యాత్రలో పాడేమోసిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, నేతలు..
తుదిశ్వాస వరకు ప్రజలకోసం పనిచేసిన అమరుల ఆదర్శంగా ఉద్యమాలు నిర్మించాలి..
సిపిఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా..
పాల్వంచ (విజయక్రాంతి): సీపీఐ సీనియర్ నాయకులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా సీపీఐ కార్యవర్గ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మాజీ కార్యదర్శి వెంపటి సూర్యనారాయణ(103) అనారోగ్యంతో బుధవారం పాల్వంచలోని ఆయన కూతురు నివాసంలో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం పాల్వంచలో అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం మృతదేహంపై సిపిఐ జెండాను కప్పి శ్రద్ధాంజలి ఘటించారు, అనంతరం అంతిమ యాత్రలో పాడే మోశారు.
ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ... తుదిశ్వాస వరకు ప్రజలకోసం పనిచేసిన అమరుల ఆదర్శంగా ప్రజాసమస్యలుపై ఉద్యమాలు నిర్మించాలినీ అన్నారు. సూర్యనారాయణ లేని లోటు కుటుంబానికే కాదు పార్టీ కూడా తీరని లోటు అని అన్నారు. పేదల పక్షాన అనేక పోరాటాలు నిర్వహించి రైతాంగ సమస్యలపై అనేక సేవలు అందించారని గుర్తుచేశారు. త్యాగదనులు అందించిన ఎర్రజెండాని పాల్వంచ ప్రాంతంలో సగర్వాంగా నిలబేడదాంనీ, కుటుంబ సభ్యులకు అండగా కమ్యూనిస్టు పార్టీ ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, పట్టణ సహాయ కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్, జిల్లా సమితి సభ్యులు డీ సుధాకర్, వేముల కొండలరావు, ప్రజాసంఘాల నాయకులు చెన్నయ్య, అన్నారపు వెంకటేశ్వర్లు, నరహరి నాగేశ్వరరావు, మడుపు ఉపేంద్ర చారి వివిధ పార్టీల నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.