09-12-2024 12:32:35 PM
హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహం కన్న తల్లిలా ఉండాలనేదే తమ ఉద్దేశమని సీసీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ్యులు సభలో ఉంటే బాగుండేదని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల భావనకు అనుగుణంగానే అన్నీ ఉండవని పేర్కొన్నారు. మీరు కోరుకున్న పద్ధతుల్లోనే విగ్రహం ఉండాలనుకోవద్దన్న కూనంనేని ఇప్పుడున్నది మీ ప్రభుత్వం కాదని గుర్తించాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వానికి కొన్ని లక్ష్యాలు ఉంటాయని చెప్పారు.
గతంలో తెలంగాణ తల్లి విగ్రహ తయారీలో ప్రతిపక్ష నేతలను పిలవలేదని చెప్పారు. గతంలో అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా చేశారని ఆరోపించారు. కవులు, కళాకారులు, మేధావుల సలహాల, సూచనల మేరకు తెలంగాణ తల్లిని రూపొందించారని వివరించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై ఎమ్మెల్యేల అభిప్రామం తీసుకుంటే బాగుండేదని కూనంనేని అభిప్రాయపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకోవచ్చు.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా మార్చితే తప్ప వచ్చిందా? అని సీపీఐ ఎమ్మెల్యే ప్రశ్నించారు.