calender_icon.png 23 September, 2024 | 6:53 PM

పేదల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలి

23-09-2024 04:16:11 PM

సూర్యాపేట,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం కుడ కుడ గ్రామ శివారు సర్వేనెంబర్ 126 ప్రభుత్వ భూమిలో నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో సర్వేనెంబర్ 243, 244లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న పేదలకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని సూర్యాపేట కలెక్టరేట్ ముందు సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్న నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ... గత ఆరు సంవత్సరాల నుండి నేరేడుచర్లలో 153 సూర్యాపేటలో 83 మంది పేదలు గుడిసెలేసుకొని జీవిస్తుంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో దాడులు చేయించి కేసులు పెట్టించారు అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే స్థలంలో పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తుంటే ఈ మధ్యకాలంలో ఎమ్మార్వో లు గుడిసెలు తీస్తామని హెచ్చరికలు జారీ చేస్తే గుడిసెల్ని తీయకుండా ఉండి శాశ్వత పట్టాలి ఇవ్వాలి అని కలెక్టరేట్ ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

దీనికి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరలో ఎంక్వయిరీ చేయించి అర్హులైన ప్రతి ఒక్కరికి శాశ్వత పట్టాలు ఇస్తానని, అదే విధంగా గృహలక్ష్మి పథకం ద్వారా 5 లక్షల రూపాయలు మంజూరు చేయిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు గొడ్డలి నర్సయ్య, పేర్ల నాగయ్య,పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షులు మారసాని చంద్రకళ, ఉపాధ్యక్షులు సూరం రేణుక, కోశాధికారి జయమ్మ, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఎస్కే హుస్సేన్, పార్టీ డివిజన్ నాయకులు సయ్యద్,పిడమర్తి లింగయ్య, పిఓడబ్ల్యు జిల్లా నాయకులు లక్ష్మి, పావని, మరియమ్మ, సత్యక్క, రేష్మ, అంజన్న,మోహన్ తదితరులు పాల్గొన్నారు.