calender_icon.png 31 October, 2024 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలను విస్మరిస్తే పోరాటం తప్పదు

10-08-2024 03:42:06 PM

 సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్

మంచిర్యాల, విజయక్రాంతి : ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విశ్వవిస్తే పోరాటాలు తప్పవని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవన శంకర్ అన్నారు. శనివారం ఎం కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన సిపిఐ మంచిర్యాల జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ప్రజాసమస్యలను విస్మరిస్తే పోరాటం తప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీ పై ప్రజలందరూ విశ్వాసంతో గెలిపించారని ఆ విశ్వసాన్ని నిలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు.రైతు రుణాల మాఫీలో రైతుల అయోమయానికి గురికాకుండా చూడాలని  కోరారు.

రైతు రుణ మాఫీ పై పూర్తిగా ప్రభుత్వానికే స్పష్టత లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. రేషన్ (ఫుడ్ సెక్యూరిటీ) కార్డులు, ఆసరా పెన్షన్ లు,వెంటనే ఇవ్వాలని కోరారు. సంతాప తీర్మానం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు ప్రవేశ పెట్టారు. సిపిఐ  రాష్ట్ర రాష్ట్ర కేంద్రం ఆఫీస్ కార్యదర్శి కామ్రేడ్ ధూళిపాళ్ల రామచందర్ రావు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య, కేరళ రాష్ట్రం లో వరద విపత్తులో మరణించినా ప్రజలకు సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశం సంతాపం ప్రకటించి మౌనం పాటించారు.

అంతకు ముందు పార్టీ పతాకాన్ని సిపిఐ  సీనియర్ నాయకుడు చిప్ప నర్సయ్య ఆవిష్కరించారు. సిపిఐ  జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం సిపిఐ జిల్లా సమితి సభ్యురాలు రేగుంట చేంద్రకళ, సిపిఐ జిల్లా సమితి సభ్యులు బొంతల లక్ష్మినారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి సీతారామయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామడుగు లక్ష్మణ్, సిపిఐ జిల్లా కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నర్సయ్య,మిట్టపల్లి వెంకట స్వామి,బొల్లం పూర్ణిమ,మేకల దాసు, జోగుల మల్లయ్య, రేగుంట చేoద్రశేఖర్, కారుకూరి నగేష్,K వీరభద్రయ్య, ధాగం మల్లేష్,లింగం రవి, మిట్టపల్లి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.