calender_icon.png 2 February, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ బాధితులతో పొంగులేటిని కలిసిన సీపీఐ నాయకులు

29-01-2025 01:32:07 AM

తంగళ్లపల్లి, జనవరి 28: హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, రాజన్న సిరిసిల్ల  సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు సుద్దాల ప్రభాకర్,  మండెపల్లి గ్రామానికి చెందిన భూమిని కోల్పోయిన బాధితులందరు  కలిశారు.

తంగళ్ళపల్లి మండలంలోని మండెపల్లి గ్రామంలో 377 సర్వే నెంబర్ లో 120 కుటుంబాలకు చెందిన దాదాపు 350 ఎకరాల భూమిని తీసుకొని నష్ట పరిహారము అందించలేదని ఉపాధి అవకాశాలు లేక భూములు కోల్పోయి కుటుంబాలు జీవనోపాధి లేక చితికిపోతున్నారని 2013 భూ సేకరణ చట్టం ప్రకారంగా భూములు గనుక ప్ర భుత్వం తీసుకుంటే అట్టి భూములకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం సహకరించాలని చట్టంలో ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు అన్యాయం చేశాయని బాధి తులకు అండగా ప్రభుత్వం నిలవాలని పొంగులేటికీ వినతిపత్రం అందజేస్తూ తెలిపారు.