07-03-2025 01:28:49 AM
నివాళులు అర్పించిన సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
వైరా,మార్చి 6 (విజయ క్రాంతి ) : వైరా మున్సిపాలిటీ పరిధిలోని లాలాపురం గ్రామ సిపిఐ(ఎం) పార్టీ సభ్యులు, యువజన నాయకులు సంక్రాంతి సతీష్ గురువారం అకాల మరణం చెందారు. పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు సంక్రాంతి మధుసూదనరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, భౌతికకాయం పై పార్టీ పతాకాన్ని ఉంచి , పూ లమాల వేసి నివాళులు అర్పించారు. వీరితోపాటు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, రాంపూడి రోశయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, తాళ్ళపల్లి కృష్ణ, మండల కార్యదర్శులు చింతనిప్పు చలపతిరావు, చెరుకుమల్లి కుటుంబరావు, బాణాల శ్రీనివాసరావు, దొడ్డపనేని కృష్ణార్జునరావు, తోట నాగేశ్వరరావు, మధు విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి వీరభద్రరావు, ఉపాధ్యక్షులు మల్లెంపాటి ప్రసాదరావు, ఎస్‌ఆర్ ఠాగూర్ విద్యా సంస్థల చైర్మన్ సంక్రాంతి రవికుమార్, మల్లెంపాటి రామారావు, పారుపల్లి శ్రీనాథ్ బాబు, సంక్రాంతి నర్సయ్య, సంక్రాంతి పురుషోత్తమరావు, సంక్రాంతి చంద్రశేఖర్, బొంతు సమత, గుడిమెట్ల రజిత గుడిమెట్ల మోహన్ రావు, కొంగర సుధాకర్, అనుమోలు రామారావు, షేక్ నాగుల్ పాషా, కట్టా రాంబాబు, మాడపాటి మల్లికార్జున్, మాడపాటి వెంకటి, వడ్లమూడి మధు, పాసంగులపాటి చలపతిరావు, చింతనిప్పు ప్రసాద్, బంధువులు స్నేహితులు, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.