calender_icon.png 28 March, 2025 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలు, కష్ట జీవులు, కార్మికుల పార్టీ సీపీఐ

21-03-2025 01:14:43 AM

పోడు భూముల పట్టాలకోసం మరో ఉద్యమం చేపడదాం

పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు ముత్యాల విశ్వనాథం

పాల్వంచ, మార్చి 20 (విజయ క్రాంతి) పేద ప్రజలు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల పార్టీ సిపిఐ అని, సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో నిర్మితమైన ఎర్ర జెండా పార్టీకి ఎదురులేదని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం అన్నారు. గురువారం మండల పరిధిలోని ఉలవనూర్ బంజర పంచాయితీ చిరతానిపాడుగుంపు సీపీఐ శాఖ మహాసభ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన విశ్వనాథం మాట్లాడుతూ నిరంతరం సమరశీల పోరాటాలు సాగిస్తున్న సిపిఐ ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమైన పార్టీ కాదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిస్కారంకోసం, పార్టీ పటిష్ఠతకోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. అనాదిగా పోడు సాగు చేసుకుంటున్న పోడు సాగుదారులందరికీ పట్టాలు అందించి రైతు భరోసా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు నియోజకవర్గని అన్ని విధాల అభివృద్ధి చేయటానికి, నియోజకవర్గ పరిధిలోని ఏజెన్సీ గ్రామాలను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి పంచాయతీలో సిపిఐకు ప్రాతినిధ్యం వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఉప్పుశెట్టి రాహుల్, మండల నాయకులు ఇట్టి వెంకట్రావు, నిమ్మల రాంబాబు, వేములపల్లి శ్రీను, కొంగర అప్పారావు, అమృత్తరావు, బాలాజీ, రేగు కృష్ణ, బాలు స్వర్ణలత రమణ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.సభ అనంతరం గ్రామ శాఖ నూతన కమిటీని 11 మందితో ఎన్నుకోవడం జరిగింది. చిరతానిపాడుగుంపు శాఖ కార్యదర్శిగా మాడే చుక్కారావ్, సహాయ కార్యదర్శిగా సురేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది