calender_icon.png 3 November, 2024 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఐది వందేళ్ల సుదీర్ఘ చరిత్ర

03-11-2024 12:55:32 AM

  1. ప్రజలకు వివరించేందుకు ఉత్సవాలు
  2. ఎమ్మెల్యే కూనంనేని

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 2 (విజయక్రాంతి): సీపీఐది వందేళ్ల సుదీర్ఘ చరిత్రని, ఈ చరిత్రను ప్రజలకు వివరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి సీపీఐ కౌన్సిల్ సమావేశం శనివారం పాల్వంచలో శనివారం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తం గా వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపు నిచ్చారు. జిల్లాలోని 476 గ్రామపంచాయతీలు, 124 మున్సిపల్ వార్డుల్లో ఎర్రజెండా రెపరెపలాడాలన్నారు. కాగా ప్రతిపక్షాల నో ళ్లు మూయించేందుకు, ప్రభుత్వంపై రైతులకు నమ్మకం కలిగేందుకు షరతులు, ఆంక్షా లు లేకుండా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

రైతు భరోసా, రేషన్‌కార్డులు, పెన్షన్లపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్య, ఎండా మౌలానా, జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యా ల విశ్వనాథం, సరెడ్డి పుల్లారెడ్డి, నరాటి ప్రసాద్, రేసు ఎల్లయ్య, సాయి బాబా, పూర్ణచందర్‌రావు పాల్గొన్నారు.