calender_icon.png 22 April, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఐ డివిజన్ సమావేశాలు నిర్వహించాలి

22-04-2025 12:00:00 AM

జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు

హుజూర్ నగర్, ఏప్రిల్ 21: సిపిఐ పార్టీ డివిజన్ సమావేశాలు నిర్వహించాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు కోరారు. సోమవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ప్రతి ప్రాంతంలో డివిజన్ సమావేశాలు నిర్వహించి పార్టీ  బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు. మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆయన అన్నారు.

ప్రతి వార్డులో సమావేశాలు నిర్వహించి కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని ఆయన అన్నారు. మే డే ఉత్సవాల నిర్వాణకు ప్రతి ప్రాంతంలో నాయకులు కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ నాయకులు మామిడి వెంకటేశ్వర్లు, గుండు వెంకటేశ్వర్లు, కేవీఎన్ మూర్తి, జడ వెంకన్న, కృష్ణ, సైదులు, మస్తాన్, మల్లయ్య, ప్రసాద్, సత్యవతి, రమణ పాల్గొన్నారు.