calender_icon.png 22 April, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి

21-04-2025 05:54:37 PM

సిపిఐ ధర్నా 

మహబూబాబాద్,(విజయక్రాంతి): పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని, వక్ఫ్ సవరించిన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సిపిఐ కార్యదర్శి విజయసారథి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కష్టాలు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. మతతత్వాన్ని పెంచి పోషించే విధంగా వ్యవహరిస్తూ, ముస్లింల హక్కులను కాలరాచే విధంగా కుట్ర చేస్తుందని ఆరోపించారు.  ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు అజయ్ సారధి రెడ్డి, శ్రీనివాస్, పెరుగు కుమార్, వేసిన పల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, చొప్పరి శేఖర్, ఫాతిమా, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.