calender_icon.png 23 February, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరాటాల తోనే హక్కులు సాధ్యం

22-02-2025 11:49:20 PM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

ఘనంగా సీపీఐ శత జయంతి ఉత్సవాలు

మణుగూరు,(విజయక్రాంతి): పేద, బడుగు బలహీన వర్గాల, కార్మికుల హక్కులను సాధించాలంటే పోరాటాలతోనే సాధ్యమవుతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(Dem MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. శనివారం భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని చిక్కుడుగుంట గ్రామంలో సీపీఐ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.  త్సవాల్లో  భాగంగా మైసా కొండయ్య భవనంలో అమరవీరుల స్మారక సంస్మరణ పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు. అంతకు ముందు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా ఏఐటీయూసీ జండాను ఆవిష్కరించారు. అనంతర శతాబిద ఉత్సవాల సభలో సాంబశివరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధనాలను ఖండించారు. సీపీఐ పార్టీ ఎల్లప్పుడు పేదల పక్షపాతి అన్నారు.  భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన స్థానిక భూ నిర్వాసితులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వాలు అవలభింస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. సీపీఐ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరుఊ సైనికుల్లా పనిచేయాలని, త్వరలో జగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలన్నారు. బీటీపీఎస్లో కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే ఏఐటీయూసీ బలోపేతనాకి కృషి చేయాలని బీటీపీఎస్ ఉద్యోగులను కోరారు. ఈ కార్యక్రమంలో బీటీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రావుల మురళి, కార్యదర్శి దుగ్యాల సుధాకర్, జిలీఆ్ల కార్యవర్గ సభ్యులు సరెడ్డి పుల్లారెడ్డి,  మున్నా లక్ష్మి కుమారి, పాల్వంచ పట్టణ కార్యదర్శి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.