calender_icon.png 26 April, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఐ కొవ్వొత్తుల ర్యాలీ

25-04-2025 11:34:01 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి సంతాప సూచకంగా బెల్లంపల్లిలో శుక్రవారం రాత్రి భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సీపీఐ జాతీయ సమితి, రాష్ట్ర సమితి ఆదేశాల మేరకు బెల్లంపల్లి పట్టణంలోని సిపిఐ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమరులైన పర్యటకులకు నివాళులర్పించారు. భారతదేశ ఆర్మీలో 1,80,000 జవాన్ల కొరత ఉందని దీని వైఫల్యంగానే ఉగ్రదాడిలో భారత అమాయక ప్రజలు 26 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని ఈ చర్యలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సీపీఐ నాయకులు అన్నారు.

కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనీ  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, రాష్ట్ర సమితి సభ్యులు  మిట్టపల్లి వెంకటస్వామి, బొల్లం పూర్ణిమ, మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, బిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు  డి ఆర్ శ్రీధర్, పట్టణ సహాయ కార్యదర్శి కొంకుల రాజేష్, జిల్లా సమితి సభ్యులు  మేకల రాజేశం, ఏఐటీ యూసీ బ్రాంచి సహాయ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్, శాంతి గని మైన్ ఫిట్ సహాయ కార్యదర్శి మంతెన రమేష్, పట్టణ కార్యవర్గ సభ్యులు రత్నం రాజం, బొంకురి రామచందర్, పట్టణ హామాలి సంఘ కార్యదర్శి కుందేళ్ళ శంకర్, పట్టణ కౌన్సిల్ సభ్యులు బండారి శంకర్, అందుగుల రాజేందర్, కామెర దుర్గయ్య, బూర్ల సమ్మయ్య, నాయకులు ఉప్పుల శంకర్, కే తిరుపతి, లింగాల వెంకటేశ్వర్లు, ఎనుముల రాయమల్లు, సారయ్య, రవి శంకర్ పాల్గొన్నారు.