01-04-2025 12:00:00 AM
ఖమ్మం, మార్చి 31 (విజయక్రాంతి ): భారతకమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) అఖిల భారత 24వ మహాసభలు ఏప్రిల్ 2 నుండి 6 వరకు తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో జరగనున్నాయని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. అఖిల భారత మహాసభలకు జిల్లా నుండి ముగ్గురు ప్రతినిధులతో పాటు రాష్ట్ర కేంద్ర బాధ్యతల్లో వున్న పి.సుదర్శన్రావుతో పాటు జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి హాజరవుతున్నారని తెలియజేశారు. అదే విధంగా ఏప్రిల్ 6న జరిగే బహిరంగ సభ, పాతిక వేల మందితో జరిగే రెడ్షర్ట్ వాలంటీర్స్ కవాతుకు ఖమ్మం జిల్లా నుండి కార్యకర్తలు హాజరవుతున్నారని తెలిపారు. ఇప్పటికే మహాసభ ప్రారంభోత్సవానికి, బహిరంగ సభకు హాజరు కావటానికి అనేకమంది కార్యకర్తలు ట్రైన్ల ద్వారా బయలుదేరి వెళుతున్నట్లు నున్నా తెలియజేశారు.