calender_icon.png 10 March, 2025 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజేతలకు బహుమతులు అందజేసిన సీపీ

21-01-2025 11:45:18 PM

ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కొద్ది రోజులుగా నిర్వహించిన పోలీస్ వార్షిక  గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్  2025 మంగళవారం విజయవంతంగా ముగిసింది. మూడు రోజులు పాటు నిర్వహించిన క్రీడా పోటీల్లో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహాంగా పాల్గొన్నారు. ముగింపు వేడుకలకు పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ ముఖ్య అతిధిగా పాల్గొని, గౌరవ వందనం స్వీకరించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. మారుతున్న పరిస్ధితుల్లో పోలీసింగ్ అనేది చాలా సవాల్‌తో కూడినదని అన్నారు. చాలెంజ్‌గా  సమర్ధవంతంగా పని చేసి, ప్రజలకు మెరుగైన సేవలందించాలంటే శారీరక ఆరోగ్యం, మానసిక దృఢత్వం కలిగి ఉండడం పోలీస్ సిబ్బందికి చాలా కీలకమని అన్నారు. సిబ్బందిలోని మానసిక ఒత్తిడిని తగ్గించి, క్రీడాస్పూర్తిని కల్పించేందుకు స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహించినట్లు తెలిపారు. ఉత్సాహాంగా పాల్గొని ప్రతిభ కనబర్చారని అన్నారు. క్రీడలను విజయవంతంగా నిర్వహించిన అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ నరేశ్‌కుమార్, అడిషనల్ డిసిపి లా అండ్ ఆర్డర్ ప్రసాదరావు, ఏఆర్ డిసిపిలు కుమారస్వామి, విజయబాబు, ట్రైనీ ఐపీఎస్ రుత్విక్ సాయి, ఏసీపీలు నర్సయ్య, సుశీల్‌సింగ్, రమణమూర్తి, తిరుపతిరెడ్డి, రెహమన్, సాంబరాజు, ఫణిందర్, రవి, వెంకటేశ్, సర్వర్ తదితరులు పాల్గొన్నారు.