భద్రత ఎక్స్ గ్రేసియా చెక్ అందజేత
మంచిర్యాల, (విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ దేవాపూర్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ రెడ్డి అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు భద్రత ఎక్స్ గ్రేసియా రూ.7,98,320 చెక్ ను రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ శుక్రవారం తన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా సిపి ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం తో పాటు వారి కుటుంబాలకి అండగా ఉంటామని అన్నారు.
అనంతరం మరణించి హెడ్ కానిస్టేబుల్ కుటుంబ ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసేవిదంగా చూస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ అశోక్ కుమార్, సూపరిండెంట్ సంధ్య, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం, స్వామి పాల్గొన్నారు.