calender_icon.png 22 December, 2024 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంధ్య థియేటర్ ఘటనపై వీడియో విడుదల

22-12-2024 05:29:13 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): సంధ్య థియేటర్ ఘటనపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదివారం వీడియో విడుదల చేశారు. డిసెంబర్ 4వ తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో పుష్ప-2 ప్రీమియార్ షో జగిరింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రదర్శనకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ రోజు తన ఫ్యామిలతో కలిసి థియేటర్ కు వచ్చారు. అల్లు అర్జున్ రావడం చూసిన అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా.. తన కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా కోనసాగుతుందని నగర సీపీ తెలిపారు. ఈ కేసులో న్యాయపరమైన సలహలు తీసుకోని ముందుకెళ్తామని వివారించారు. అదేవిధంగా అల్లు అర్జున్  వద్దకు వెళ్లేందుకు ఎస్హెచ్వో కూడా తీవ్రంగా కష్టపడాల్సి వచ్చిందన్నారు. అల్లు అర్జున్ మేనేజర్ వద్దకు వెళ్లి తొక్కిసలాట విషయం చెప్పామని, మహిళ చనిపోయిందని, ఆమె కుమారుడు ప్రాణపాయ స్థితిలో ఉన్నాడని కూడా చెప్పామని ఎన్హెచ్వో వెల్లడించిందన్నారు.

ఈ క్రమంలో నటుడు అల్లు అర్జున్ వద్దకు తాము వెళ్లెందుకు థియేటర్ మేనేజర్ ఒప్పుకోలేదని చెప్పారు. డీసీపీ వెళ్లి చర్య తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అల్లు అర్జున్ థియేటర్ నుంచి వెళ్లకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని, సినిమా చూశాకే వెళ్తానని అల్లు అర్జున్ పోలీసులతో చెప్పారని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ వచ్చేందుకు థియేటర్ యాజమన్యం చిక్కటిపల్లి పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు చేస్తే, రెండు థియేటర్లకు ఒకటే ఎంట్రీ, ఎగ్జిట్ ఉన్నందున దరఖస్తును తిరస్కరించినట్లు సీపీ పేర్కొన్నారు. అయితే అల్లు అర్జున్ థియేటర్ కు రావద్దని యాజమన్యం చెప్పారో.. లేదో తెలియదని, ఆయన థియేటర్ కు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం లేదని సీఐ వెల్లడించారు. ఆ తొక్కిసలాటలో తనే చనిపోతానని అనుకున్నట్లు సీఐ .