calender_icon.png 16 March, 2025 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో బందోబస్తు పరిశీలించిన సీపీ

15-03-2025 12:48:02 AM

కరీంనగర్ క్రైం, మార్చి 14 (విజయ క్రాంతి): హోలీ పండుగ సందర్భంగా కరీంనగర్ నగరంలోని పలు ప్రాంతాల్లో  శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పర్యటించి బందోబస్తు పరిశీలించారు.  నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రార్ధన మందిరాలు, ప్రధాన కూడళ్ళ వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును ఆయన స్వయంగా  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కమిషనరేట్ ప్రజలందరికీ కరీంనగర్ పోలీస్ శాఖ తరపున హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.