calender_icon.png 30 April, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుద్ధపల్లి ఆశ్రమ్ హైస్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ

15-04-2025 01:14:49 AM

-అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని విద్యార్థులతో సహపంక్తి భోజనం

నిజామాబాద్ అర్బన్, ఏప్రిల్ 14( విజయక్రాంతి): జిల్లా పోలీస్ కమీషనర్ పీ సాయి చైతన్య ఆదివారం రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు  డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుద్ధపల్లి ఆశ్రమ్ హైస్కూల్ ను క్షుణ్ణంగా తనిఖీ చేసి స్థానిక స్థితిగతులను పరిశీలించారు.

విద్యార్థులతో భేటీ అయి వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు, పిల్లలకు భోజనం వడ్డించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.అనంతరం కంప్యూటర్ రూమ్,  లైబ్రరీ రూమ్,  మెడికల్ రూమ్,  కిచెన్ సెక్షన్ లో గల వసతులను తనిఖీ నిర్వహించారు వాటిని విద్యార్థులు ఏ విధంగా వాడుకుంటున్నారో స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని ఉన్నత స్థాయిలో ఉన్న వారిని స్ఫూర్తిదాయకముగా తీసుకొని వారి అంకితభావంతో కృషి చేయాలని అన్నారు.

విద్యార్థులు విద్యార్థి దశ నుంచి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని తథానుగుణంగా విద్యార్థులు ఏకాగ్రతతో పట్టుదలతో చదివి తమ లక్ష్యాలను సాధించవచ్చు అని హితువు పలికారు. విద్యార్థులు దురాలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ నో స్మోకింగ్,నో డ్రింకింగ్,నో డ్రగ్స్ అల్ థ్రు అవుట్ మై లైఫ్ అనే నినాదన్ని విద్యార్థులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిచ్ పల్లి సిఐ  మల్లేష్ , డిచ్ పల్లి ఎస్త్స్ర ఎం.డి. షరీఫ్, ఆశ్రమ్ హై స్కూల్ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.