calender_icon.png 31 January, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ ట్రేడింగ్ మోసాలు.. 52 మంది అరెస్టు

29-01-2025 02:47:34 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): డిజిటల్ ట్రేడింగ్(Digital Trading) పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(Hyderabad CP CV Anand) పేర్కొన్నారు. బ్యాంక్ మేనేజర్ తో పాటు 52 మంది నిందితులను అరెస్టు చేసి, వారిని నుంచి భారీగా చెక్ బుక్స్, సెల్ ఫోన్స్, రబ్బర్ స్టాంపులు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల్లొ ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులు ఉన్నారని, వీరు మూడు రకాల సైబర్ క్రైమ్ మోసాలకు పాల్పడినట్లు అంకరించారన్నారు.

ఫేస్ బుక్ బ్రౌజింగ్, వాట్సప్ గ్రూప్స్ ద్వారా అమాయక ప్రజలను ఆకర్షిస్తూ, ట్రేడింగ్ పేరుతో ఇప్పటి వరకు సూమారుగా రూ.93 లక్షలు కాజేశారని వెల్లడించారు. ఇప్పటికైన ప్రజలు గుర్తు తెలియని యాప్స్, వాట్సప్ గ్రూప్స్ లో జాయిన్ కావొద్దని, ఆన్ లైన్ పెట్టుబడులపై జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు. చదువుకున్న వ్యక్తులు కూడా సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతున్నారు. ఈ కేటుగాళ్లు గతేడాది రూ.3500 కోట్లు కాజేస్తే, అందులో కేవలం 13 శాతం మాత్రమే రికవరీ చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు.