హైదరాబాద్,(విజయక్రాంతి): అఫ్జల్‌గంజ్లో కాల్పులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. నిందితులను పట్టుకునేందుకు పోలీసుల గాలింపు విస్తృతంగా కొనసాగుతోంది. బుధవాంర ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(Hyderabad CP CV Anand) వివరణ ఇచ్చారు. అఫ్జల్ గంజ్ కాల్పుల ఘటన(Afzalgunj Shooting Incident)లో నిందితుల కోసం 4 రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారని, నిందితులు బిహార్ వాసులుగా గుర్తించమన్నారు. నిందితులపై బిహార్ ప్రభుత్వం రూ.3 లక్షల రివార్డు ప్రకటించిందని సీపీ ఆనంద్ పేర్కొన్నారు. కాల్పుల అనంతరం నిందితులు తప్పించుకోవడానికి నిందితులు ప్రణాళికలు రచించారని, ఏడాదిన్నర నుంచి తప్పించుకుని తీరుగుతున్నట్లు సమాచారం.
అఫ్జల్ గంజ్ లో కాల్పలు జరిపిన తర్వాత నిందితులు పలు ప్రాంతాల మీదుగా చెన్నై వెళ్లినట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బిహార్ కు చెందిన నిందుతులు బిహార్, కర్ణాటక, తెలంగాణ, ఛతీస్ గఢ్ రాష్ట్రాల్లో వీరు వరుస చోరీలకు తెగబడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అఫ్జల్‌గంజ్‌లోలో కాల్పులు జరిపిన దొంగలు నేరుగా ఆటోలో సికింద్రాబాద్‌కు వెళ్లినట్లుగా గుర్తించారు. రైల్వే స్టేషన్ సమీపంలో దొంగలు బట్టలు, బ్యాగులు కొనుగోలు చేసి తిరుమలగిరి ఏరియాలో బట్టలు మార్చుకుని బ్యాగ్‌లను మార్చేశారు. అక్కడి నుంచి పలు ప్రాంతాల నుంచి చెన్నై వెళ్లినట్లు సీపీ ఆనంద్ వెల్లడించారు. దొంగల్ని త్వరలోనే పట్టుకుంటామని సీపీ ఆనంద్ పేర్కొన్నారు.