calender_icon.png 4 April, 2025 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోత్కపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సీపీ అంబర్ కిషోర్ ఝా

03-04-2025 12:00:00 AM

రామగుండం మార్చి-2  (విజయ క్రాంతి) రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా  పోత్కపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించారు. పోలీస్ స్టేషన్ సందర్శించిన సీపీ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, వివిధ కేసులలో సిజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. అనంతరం రిసెప్షన్  సిబ్బందిని అడిగి పిర్యాదుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. 

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యను తెలుసుకొని వారికీ భరోసా నమ్మకం కల్పించాలని చట్టపరిధిలో సమస్య పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.

స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలను సీపీ  ఎస్‌ఐ రమేష్ ను అడిగి తెలుసుకొవడంతో పాటు, స్టేషన్ పరిధిలో ఉన్న మావోయిస్టు ప్రభావిత గ్రామాలు, వారి కదలికలు, అజ్ఞాతం లో ఉన్న వారి వివరాలు, ఈ ప్రాంతం లో అత్యధికంగా ఎలాంటి నేరాలు నమోదవుతాయి, సమస్యత్మక గ్రామాల, సరిహద్దు ప్రాంత వివరాలు, రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు వారి ప్రస్తుత స్థితి గతులను సంబంధిత ఎస్‌ఐని అడిగి తెలిసుకోవడంతో పాటు  స్టేషన్వారిగా బ్లూకోలట్స్ సిబ్బంది పనితీరుతో పాటు, వారు విధులు నిర్వహించే సమయాలను అడిగి తెలుసుకున్నారు.

గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలకు సంబంధించి అక్రమ రవాణా, సరఫరా, నిల్వ, సేవించే వారిపై స్టేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మత్తు పదార్థాల నియంత్రణకై నిరంతరం పనిచేయాలని నేరాల నియంత్రణకై విజుబుల్ పోలీసింగ్ అవసరమని, నిరంతం పోలీసులు పెట్రొలింగ్ నిర్వహించాలని పోలీస్ కమిషనర్ స్టేషన్ అధికారులకు సూచించారు. సిపి విట్ట పోలీస్ సిబ్బంది ఉన్నారు.