calender_icon.png 26 March, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నెపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సీపీ అంబర్ కిషోర్ ఝా

24-03-2025 05:48:05 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): కన్నెపల్లి పోలీస్ స్టేషన్ ను సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సందర్శించారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న సీపీ ముందుగా స్టేషన్ పరిసరాలు పరిశీలించి, సిబ్బందితో మాట్లాడారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు, శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయని తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను సీపీ ఎస్ఐ గంగారాంను అడిగి తెలుసుకున్నారు.

పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మావోయిస్టుల వివరాలు, పోస్టర్ లను పరిశీలించి వారి గురించి సిబ్బందిని అడిగారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న కన్నెపల్లి పోలీస్ స్టేషన్ భవనంను పరిశీలించి, జరుగుతున్న పనులు గురించి అడిగి తెలుసుకున్నారు. సీపీ వెంట స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఎన్ఐబి ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఎస్ఐ గంగారాం ఉన్నారు.