calender_icon.png 30 April, 2025 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుటుంబ క్షేమం కన్నా... సమాజం క్షేమం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీస్ మాత్రమే

30-04-2025 03:22:46 PM

ఉద్యోగ  విరమణ పొందిన పోలీస్‌ అధికారు సన్మానం లో సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా

రామగుండం, (విజయక్రాంతి): కుటుంబ క్షేమం కన్నా... సమాజం క్షేమం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీస్ మాత్రమేనని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించి నేడు ఉద్యోగ విరమణ పొందిన పోలీస్‌ అధికారులను సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా  బుధవారం  ఘనంగా సత్కరించారు. కమిషనరేట్‌ కార్యాలయములో ఏర్పాటు చేసిన కార్యక్రమములో పదవీ విరమణ పొందిన పోలీస్‌ అధికారులు ఇన్స్పెక్టర్ డి. కమలాకర్, ఏఆర్ఎస్ఐ ఎం. నర్సయ్య, సీనియర్ అసిస్టెంట్ ఎస్ సుందర్ రావు లను పోలీస్‌ కమిషనర్‌ పూలమాలలతో ఘనంగా సత్కరించడంతో పాటు, వారికి జ్ఞాపికలను అందజేసారు. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తమ కుటుంబ క్షేమం కన్నా సమాజం క్షేమం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులు మాత్రమేనని, ప్రస్తుతం ఉద్యోగవిరమణ చేస్తున్న పోలీస్‌ అధికారులు వారి విధి నిర్వహణ సమయంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవడంతో పాటు, కొన్ని సమయాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించి వీరు రేపటి తరం పోలీసులకు స్పూర్తిదాయకంగా నిలుస్తారని, ఉద్యోగవిరమణ చేసిన పోలీసు అధికారులు తమ ఆరోగ్యం కోసం నిరంతరం యోగ లేదా వ్యాయామాన్ని కొనసాగించడంతో పాటు, వారి కుటుంబ సభ్యులతో  సమయాన్ని కేటాయించాలని సుఖ సంతోషాలతో, ఆనందంగా జీవితం గడపాలని  కమిషనర్‌ తెలియజేశారు. ఈ కార్యక్రమములో మంచిర్యాల డీసీపీ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, ఏఓ శ్రీనివాస్, రామగుండం పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్ల కుంట పోచలింగం తో పాటు పదవీవిరమణ పొందిన పోలీస్‌ అధికారుల కుటుంబ సభ్యులు వారి బంధుమిత్రులు ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.