బీజేపీ మాజీ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
కేరళ (వయనాడ్), ఆగస్టు 03: కేరళ వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 358 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంటే.. ఈ విలయంపై ఓ బీజేపీ మాజీ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎక్కడ గోహత్య జరిగినా ఇలాంటి ఘటనలు జరుగుతూ నే ఉంటాయని రాజస్థాన్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ ఆహుజా కామెంట్ చేశారు. కేరళలోని వయనాడ్ ఘటన దీని పర్యవసానమే అని, గోహత్యలు ఆపకుంటే ఇలాంటి విషాదాలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు. ఇదివరకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో కొండచ రియలు విరిగిపడినప్పటికీ వయనాడ్ పరిమాణంలో విపత్తులకు దారి తీయలేదని చెప్పారు. కేరళ సహా ఇత ర రాష్ట్రాలలో వెంటనే గోహత్యలను ఆపేయాలని హెచ్చరించారు.