calender_icon.png 2 October, 2024 | 7:58 AM

రాష్ట్రంలోనూ గోవును రాజ్యమాతగా ప్రకటించాలి

02-10-2024 01:23:49 AM

టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ కల్వకుంట్ల రమ్యారావు 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1 (విజయక్రాంతి): దేశీయ ఆవు గోమాతను మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ రాజ్యమాతగా ప్రకటించాలని టీపీసీసీ క్యాంపెయిన్ జాయింట్ కన్వీనర్ కల్వకుంట్ల రమ్యారావు ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గోమాతను దర్శించుకున్న తర్వాతనే ఓటింగ్‌లో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే గోవును రాష్ట్ర మాతగా ప్రకటించాలని మంగళవారం ఒక ప్రకటన లో విజ్ఞప్తి చేశారు.

దేశంలో వేద కాలం నుంచి గోవుకు ప్రాధాన్యత ఉందని అన్నా రు. గోవు ప్రాధాన్యత లేకుండా మానవ మనుగడ లేదన్నారు. ఆవు పాలును ఎంతో విలువైనవిగా భావిస్తామని గుర్తు చేశా రు. మన దేశంలో హిందూవులు గోవును ఒక ప్రాణిగా కాకుండా ఒక తల్లిగా విశ్వసిస్తారని అన్నారు.

దేశంలో గోవుకు ఎంతటి ప్రాధాన్యత ఉన్నందునే రాష్ట్ర జాబితా నుంచి కేంద్ర జాబితాకు మారిందన్నారు. ఆయుర్వేద వైద్యం, పంచగవ్య చికిత్సా విధా నం, సేంద్రియ వ్యవసాయంలో ఆవు పేడ, గో మూత్రం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని పేర్కొన్నారు.