- జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద డిమాండ్
- అందుకోసం ఉద్యమం చేస్తామని ప్రకటన
న్యూఢిల్లీ, ఆగస్టు 6: గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ డిమాండ్ చేశారు. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పలు రాష్ట్రాల్లో ఉద్యమం చేపడుతామని ప్రకటించారు.
ఢిల్లీలోని తల్కతోరా ఇండోర్ స్టేడియంలో మంగళవారం జ్యోతిర్మఠ్ 55వ ప్రకటోత్సవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక గురువులతోపాటు పలువురు రాజకీయ నాయకులు, రిటైర్డ్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలి’ అని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
బంగ్లాదేశ్‌లో హింసపై కూడా ఆయన స్పందించారు. పొరుగు దేశ జనాభాలో 10 శాతం హిందువులున్నారని, తాజా సంక్షోభంలో హిం దువులపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులకు రక్షణ కల్పించాలని బంగ్లాదేశ్ సైన్యాన్ని కోరారు. ఇందుకోసం భారత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.