calender_icon.png 11 October, 2024 | 10:55 AM

ఆవు అంటే అమృతం

11-10-2024 12:00:00 AM

జన్మనిచ్చిన తల్లి తన బిడ్డకు ఒకటి, రెండు లేదా కొన్నేళ్లు మాత్రమే పాలు ఇస్తుంది. కానీ, గోమాత తన జీవితమంతా పాల ను ఇస్తుంది. ఆవు అంటేనే అమృతం వంటిది. మూత్రం నుంచి పాల వరకు అది ఉత్పత్తి చేసే ప్రతిదీ ఔషధమే. తోకనుంచి నుదుటి వరకు ఆసాం తం నిలువెత్తు కల్పతరువు. అది ఎంత పవిత్రమంటే, ఆవు చీలమండలను చూస్తే చాలు, ఆకస్మిక మరణాల నుంచి మనల్ని మనం రక్షణ పొందగలమని శాస్త్రాలు చెబుతున్నాయి.

గోవు కు ప్రదక్షిణ చేయడం ద్వారా భూమ్మీది అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించిన పుణ్యం లభిస్తుంది. ఆవు అద్భుత శక్తి శాస్త్రీయంగానూ వెల్లడైంది. పీపల్ చెట్టు, తులసి మొక్క ఎలాగైతే ప్రాణవాయువును గాలిలోకి విడుదల చేస్తాయో, అలాగే ఆక్సీజన్‌ను పీల్చి, విసర్జించే జంతువు ఒక్క ఆవు మాత్రమే అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 

ఆవు పాలు, వెన్న, నెయ్యి, మజ్జిగ వంటివైతే అమృతం లాంటివే అని పరిశోధనలు తేల్చా యి. ఆవు మూత్రం, పేడలను మలమూత్రంలా ఎంత మాత్రం భావింపరాదు. శుద్ధి చేసే పదార్థాలుగానే వాటిని పరిగణించాలి. వాటిని ఎరువు గా వాడితే ఉత్తమ నాణ్యమైన ధాన్యాలు, పండ్లు, కూరగాయల ఉత్పత్తి సుసాధ్యమవుతుంది. గోమూత్రాన్ని ఒక దైవిక ఔషధంగానే వేదపండితులు విశ్వసిస్తారు. మరోవైపు దీనిని పంటలకు సహజమైన పురుగుమందుగా భావించాలని శాస్త్రవేత్తలు అంటున్నారు.

గోమూత్రంలో అసాధారణ ఔషధ గుణాలున్నాయన్న విషయం అనేక అధ్యయనాల లో తేలింది. ప్రాచీన శాస్త్ర గ్రంథాలైన అధర్వ వేదం, చరక సంహిత, సుశ్రూత సంహిత వంటివాటిలోనే కాదు, ఆధునిక వైద్యశాస్త్ర పరంగానూ ఇది నిరూపితమైంది. ఇండోర్ (మధ్యప్రదేశ్) నగరంలోని ‘గోమూత్ర చికిత్స, పరిశోధనా కేంద్రం’ (కౌ యూరిన్ ట్రీట్‌మెంట్ అండ్ రీసర్చి సెంటర్)లో గడచిన కొన్నేండ్లుగా జరిగిన అనేక పరిశోధనల్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడైనాయి. 

కదిలే ఔషధశాల

ఆవు అంటేనే ఒక కదిలే ఔషధశాలగా పరిశోధకులు ప్రకటించారు. దీని మూత్ర చికిత్స తో నయం చేయలేని వ్యాధులు ఉండవని వారంటున్నారు. మధుమేహం, రక్తపోటు, ఉబ్బసం వంటి వాటినుంచి గుండెపోటు, క్యాన్సర్ వరకు అనేక రకాల దీర్ఘకాలిక, మొండివ్యాధులకు దీనితో చికిత్స అందించవచ్చునని అక్కడి పరిశోధకులు అంటున్నారు.

ఇప్పటికే గోమూత్ర చికిత్సతో స్వస్థతను పొందుతున్న వారు ఎందరో. నేడు చాలామంది ఎయిడ్స్ రోగులు సైతం ఆవు ఉన్నె థెరపీని తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత 15 ఏండ్లుగా మైగ్రేన్, తలనొప్పితో బాధ పడుతున్న అనేకులు ఈ థెరపీని తీసుకున్న ఆరు నెలల్లోనే కోలుకున్నట్టు చెబుతున్నారు. 

ఇండోర్‌లో ఆవు మూత్ర చికిత్స పెద్ద ఎత్తున సాగుతున్నది. అక్కడి పరిశోధనా కేంద్రంలో ఇప్పటికే సుమారు 1,50,000 మందికి చికిత్స చేసినట్టు తెలుస్తున్నది. మొత్తం రోగులలో 85 నుంచి 90 శాతం మంది వర కూ మలబద్దకంతో బాధ పడుతూ స్వస్థతను పొందినట్టు చెబుతున్నారు. ‘కడుపు శుభ్రంగా ఉంటేనే సగం రోగాలు స్వయంచాలకంగా నయమవుతాయని’ పాత సామెత. ఈ చికిత్సలో ఇదొక ప్రధానాంశం. ఆవు మూత్ర థెర పీని తీసుకునే రోగులు నెలలోపు ఆరోగ్యవంతులవుతున్నట్టు నిపుణులు వెల్లడిస్తున్నారు.

 ‘ప్రార్థన’ డెస్క్