బీజింగ్, జనవరి 6: చైనాలో హెచ్‌ఎంపీవీ అనే మరో కొత్త వైరస్ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆ దేశంలోని పిల్లులు ‘ఫిలైన్ ఇన్ఫెక్షియస్ పెర్టోనిటిస్’ అనే ప్రాణాంతక వైరల్ వ్యాధి బారిన పడుతున్నాయి. తమ పెంపుడు పిల్లులు ఈ వ్యాధి బారిన పడకూడదనే ఉద్ధేశంతో కొంతమంది వ్యక్తులు తమ పెంపుడు పిల్లులకు మనుషుల్లో కొవిడ్ నివారణకు వాడే మందులు వేస్తున్నట్లు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఫీలైన్ ఇన్ఫెక్షి యస్ పెరిటోనిటిస్ అనేది ఒక వైరల్ వ్యాధి. దీన్ని ఫీలైన్ కరోనా వైరస్ అని కూడా అంటారు. ఇది పిల్లులకు మాత్రమే వస్తుంది. ఈ వైరస్ పిల్లి శరీరం అంతటా వ్యాపించే ముందు తెల్ల రక్తకణాలకు సోకుతుంది. దీనికి వాడే మందులు చాలా ఖరీదైనవి కావడంతో వాటికి బదులుగా కొవిడ్ యాంటీ వైరల్ మందులు ప్రభా వం చూపుతాయని ఓ అధ్యయనంలో తేలినట్లు పలు కథనాలు పేర్కొన్నా యి. దీంతో అక్కడి ప్రజలు వారి పెంపుడు పిల్లులకు కొవిడ్ మందులు ఇస్తున్నారు.