calender_icon.png 1 November, 2024 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొవిడ్ మరణాలు 11.9 లక్షలకుపైగానే..

21-07-2024 01:25:19 AM

అంతర్జాతీయ సంస్థ అధ్యయనంలో వెల్లడి

ఆ అధ్యయనం లోపభూయిష్ఠం 

కొట్టిపారేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ

న్యూఢిల్లీ, జూలై 20: కొవిడ్ మహమ్మారి కారణంగా భారత్‌లో 2020లో 11.9 లక్షల కు పైగా మరణాలు సంభవించాయని ఓ అంతర్జాతీయ అధ్యయన సంస్థ ప్రకటించిందని మీడియాలో వరుసగా కథనాలు ప్రసా రం కావడం దుమారం రేపుతోంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో పాటు ప లు విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకుల బృందం జాతీయ కుటుంబ ఆరోగ్య స ర్వే నివేదికలపై కొన్ని నెలల పాటు అధ్యయనం చేసి మరణాల సంఖ్యను తేల్చాయని కథనాల్లో వెల్లడైంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఖండించింది. అధ్యయనం లోపభూయిష్ఠమని, కట్టు కథ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం కొట్టిపారేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే తప్పుడు  అధ్యయనాలు జరుగుతున్నాయని మండిపడింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికలో ఉన్న సమాచారాన్ని యావత్ దేశానికి ఆపాదించలేమని తేల్చిచెప్పింది. భారత్‌లో సివిల్  రిజిస్ట్రేషన్ సిస్టమ్ మాత్రమే విశ్వసనీయమైందని, దానిలో 99శాతం మరణాలు రికార్డ్ అవుతాయని స్పష్టం చేసింది.