calender_icon.png 24 December, 2024 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు రోజుల నష్టాలకు తెర

24-12-2024 01:14:50 AM

* రూ.78 వేలు దాటిన బంగారం ధర

* రూ.90 వేలకు వెండి..!

న్యూఢిల్లీ:  అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయంగా స్టాకిస్టులు, ఇన్వెస్టర్ల నుం చి కొనుగోళ్ల మద్దతుతోపాటు పెండ్లిండ్ల సీజన్ నేపథ్యంలో బంగారం ధర తిరిగి పుంజుకుంది. మూడు రోజుల క్షీణత నుంచి రికవరీ అయిన బంగారం ధర సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం (24 క్యారట్స్) రూ.570 వృద్ధి చెంది రూ.78,700లకు చేరుకుంది. శుక్రవారం తులం బంగారం ధర రూ.78,130 వద్ద స్థిర పడింది.

99.5 శాతం స్వచ్ఛత గల బంగారం పది గ్రాములు ధర రూ.570 పెరిగి రూ.78,300 వద్ద ముగిసిం ది.  సోమవారం కిలో వెండి ధర రూ.1,850 పుంజుకుని రూ.90 వేల మార్కుకు చేరుకుం ది. శుక్రవారం కిలో వెండి ధర రూ.88,150 వద్ద ముగిసింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ కాంట్రాక్ట్స్ ఫిబ్రవరి డెలివరీ తులం బంగారం ధర రూ.48 తగ్గి రూ.76,372లకు చేరుకుంది.

కిలో వెండి కాంట్రాక్ట్స్‌మార్చి డెలివరీ ధర రూ.637 పెరిగి రూ.89,029లకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్‌లో ఔన్స్ బంగారం 6.70 డాలర్లు తగ్గి రూ.2,638.40 డాలర్లు పలికింది. కామెక్స్ సిల్వర్ ఔన్స్ వెండి ధర 0.72 శాతం పుంజుకుని 30.18 డాలర్లకు చేరుకున్నది.